BSNL కోసం రూ. 44,720 కోట్లు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కోసం కొత్త బడ్జెట్లో రూ. 44,720 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని4జీ స్ప్రెక్టమ్ కోసం, టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌తోపాటు సంస్థ పునర్ వ్యవస్థీకరణ కోసం ఈ నిధులు ఖర్చు పెడతారు. పెట్టుబడి ఇవ్వడంతో పాటు రూ. 7443.57 కోట్లను అదనపు ఆర్థిక సాయంగా అందించనుంది. ఈ మొత్తాన్ని వీఆర్ఎస్ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. జీఎస్టీ చెల్లింపుల కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా రూ. 3550 కోట్లను అందించనుంది. వీఆర్ఎస్ కోసం ఇచ్చే మొత్తం బీఎస్ఎన్ఎల్తో పాటు ఎంటీఎన్ కోసం కూడా ఖర్చు పెడతారు.