For Money

Business News

యూపీఐ లావాదేవీలపైనా బాదుడు?

యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రతి మూల ఓ ఏటీఎం కన్పించేది. ఏ బ్యాంక్‌ కార్డు అయినా సరే… ప్రతి ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యం ఉండేది. ఇపుడు డిజిటల్‌ ముసుగులో ఏటీఎం చార్జీలు భారీగా వస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 8 సార్లు మించి క్యాష్‌ విత్‌ డ్రా చేసే ఛాన్స్‌ లేదు. అలాగే అన్ని బ్యాంకులు ఏటీఎంల సంఖ్య తగ్గిస్తున్నాయి. చాలా బ్యాంకుల ఏటీఎంలు సగానికిపైగా తగ్గాయి. ఇపుడు జనం మొత్తం యూపీఏ ఆధారంగానే చెల్లింపులు చేస్తున్నారు. ఇపుడు యూపీఏ వాడక తప్పని గత్యంతరం లేని పరిస్థితి. ఇపుడు యూపీఏ లావాదేవీలపై చార్జీ వేయాలని ప్రతిపాదన వస్తోంది. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలు యూపీఏ చార్జీలు వసూలు చేస్తున్నారు. కరెంటు బిల్లు యూపీఏ లేదా ఆన్‌లైన్‌లో చెల్లిస్తే చార్జీలు వేస్తున్నారు. ఇపుడు అన్ని లావాదేవీలపై యూపీఏ చార్జి వేసే యోచన చేస్తోంది కేంద్రం. ప్రస్తుతం ఈ తరహా పేమెంట్స్‌పై ఎటువంటి ఛార్జీలు లేవు. కాని తాజా వార్తల ప్రకారం త్వరలోనే ఈ లావాదేవీలపైనా మర్చెంట్ ఛార్జీలంటూ కస్టమర్లపై భారం వేయనున్నారు. దీనికి సంబంధించి పలు జాతీయ మీడియా సంస్థలు రాస్తున్నాయి. యూపీఐ ద్వారా రూ.3,000కు పైబడిన లావాదేవీలపై తొలుత ఛార్జీలు విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ కథనాల్లో పేర్కొంటున్నారు.