For Money

Business News

గూగుల్‌ను విడగొట్టాల్సిందేనా?

ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో ముఖ్యంగా సెర్చింగ్‌ విషయంలో గూగుల్‌ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని, ఈ కంపెనీని విచ్ఛిన్నం అంటే పలు విభాగాలుగా విడగొట్టాల్సిందేనని అమెరికా న్యాయ శాఖ భావిస్తోంది. ఈ మేరకు పలు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. క్రోజ్‌ బ్రౌజర్, ప్లే స్టోర్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో విషయంలో ఈ కంపెనీ అక్రమ పద్ధతిలో గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తోందని అమెరికా న్యాయ శాఖ ఆరోపిస్తోంది. ఆన్‌లైన్ సెర్చింగ్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి గూగుల్‌ యాంటీ-ట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆగస్టులో కోర్టు అభిప్రాయపడింది. ఆ తరవాత దీనికి కొన్ని పరిష్కార మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు రెడీగా ఉన్నాయి. కొత్తగా మార్కెట్‌లో వచ్చే డివైజస్‌లో తన సెర్చ్ ఇంజన్‌ను ముందే ఇన్‌స్టాల్ చేసేలా వివిధ కంపెనీలతో గూగుల్‌ డీల్‌ చేసుకొంటోంది. మరికొన్ని పరికరాల్లో డిఫాల్ట్ ఆప్షన్‌గా తన సెర్చి ఇంజిన్‌ను సెట్ చేయడం కోసం ఇతర టెక్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటోంది. దీంతో ప్రత్యర్థి కంపెనీలకు స్థానం లేకుండా చేస్తోందిన అమెరికా న్యాయ శాఖ భావిస్తోంది. ఐఫోన్లను తయారు చేసే యాపిల్‌ కంపెనీతో గూగుల్‌ ఇలాంటి ఒప్పందాన్ని చేసుకుందని పేర్కొంది. దీని కోసం 2021లో యాపిల్‌తో సహా పలు కంపెనీలకు గూగుల్‌ ఏకంగా 2600 కోట్ల డాలర్లను చెల్లించినట్లు న్యాయశాఖ గుర్తించింది. ఇదే విషయమై గూగుల్‌ స్పందిస్తూ… ఈ కేసు కోర్టులో ఎప్పటి నుంచో సాగుతోందని.. ఒకవేళ కోర్టు ఇదే తీర్పు ఇచ్చే పక్షంలో తాము అప్పీల్‌ చేస్తామని స్పష్టం చేసింది.

Leave a Reply