For Money

Business News

LT Foods: గుడ్‌ న్యూస్‌

ఈ షేర్‌ ఇన్వెస్టర్లకు మూడేళ్ళలో 533 శాతం, ఏడాదిలో 152 శాతం ప్రతిఫలాన్ని అందించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ షేర్‌ వంద శాతం పెరిగింది. మూడు నెలల్లో 58 శాతం, ఒక నెలలో 34 శాతం రిటర్న్‌ ఇచ్చిన ఎల్‌టీ ఫుడ్స్‌ మరో మైలు రాయికి చేరువ అవుతోంది. దావత్‌ పేరుతో బాస్మతి బియ్యాన్ని అమ్మే ఈ కంపెనీ బాస్మతి బియ్యాన్ని భారీగా ఎగుమతులు కూడా చేస్తోంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాస్మతి బియ్యంపైనా కనీస ఎగుమతి ధర నిబంధనను తొలగించింది. గత ఏడాది బియ్యం దిగుబడి తగ్గడం, ధరలు పెరగడంతో ప్రభుత్వం బాస్మతి బియ్యం ఎగుమతులపై పలు ఆంక్షలు విధించింది.
టన్నుకు కనీస ఎగుమతి ధర 950 డాలర్లుగా ఉంటేనే ఎగుమతికి కేంద్రం అనుమతిస్తోంది. అంతకన్నా తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతిని నిషేధించింది. ఇపుడు ఈ నిబంధన తొలగింపుతో బాస్మతి బియ్యం ఎగుమతులు భారీగా పెరగనున్నాయి. దీని వల్ల రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని కేంద్రం అంటోంది. అయితే బాస్మతిపై ఆంక్షలను ఎత్తివేస్తారనే వదంతులు గత కొన్ని రోజులుగా మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలను ఎల్‌టీ ఫుడ్స్‌ డిస్కౌంట్‌ చేసిందా? లేదా ఈ షేర్‌లో మరో ర్యాలీ వస్తుందా అన్నది చూడాలి. ఎలాగైనా… ఈ షేర్‌ త్వరలోనే రూ. 500కు చేరడం ఖాయమని మార్కెట్‌ అనలిస్టులు అంటున్నారు. మరి సోమవారం ఈ షేర్‌ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి మరి.