జాబ్ డేటా బాగున్నా.. పతనమే
ఫిబ్రవరి నెలలో అమెరికాలో ఉద్యోగ అవకావాలు నిపుణుల అంచనాలకు మించాయి. అయినా… స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఇపుడు మార్కెట్కు రష్యా,ఉక్రెయిన్ యుద్ధమే అధికంగా ప్రభావితం చేస్తోంది. ఫిబ్రవరిలో అమెరికాలో నిరుద్యోగం 3.8 శాతానికి క్షీణించింది. అయితే రాత్రి బ్యాంకులు, ఐటీ కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అమెజాన్, యాపిల్, గూగుల్,మైక్రోసాఫ్ట్ షేర్లు ఒక శాతంపైగా నష్టపోయాయి. అలాగే ఎస్ అండ్ పీ 500 బ్యాంక్స్ సూచీ కూడా 3.5 శాతం క్షీణించింది. గత వారంలో ఈ సూచీ 9శాతం క్షీణించడం విశేషం. రాత్రి వాల్స్ట్రీట్లో డౌజోన్స్ 0.53 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.79 శాతం, నాస్డాక్ 1.66 శాతం చొప్పున నష్టంతో ముగిశాయి.