పేటీఎం కొనుగోలు చేయండి
చాలా రోజుల తరవాత పలు బ్రోకింగ్ రీసెర్చి సంస్థలు పేటీఎంకు అనుకూల పాజిటివ్ రిపోర్ట్‌లు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఈ షేర్ రూ. 833 వద్ద ట్రేడవుతోంది. యూపీఐ, నాన్ యూపీఏ పేమెంట్స్‌లో పేటీఎం వాటా పెరుగుతుందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. అలాగు పేటీఎం నుంచి రుణం తీసుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుత వద్ద రిస్క్, రివార్డ్ ఈక్వేషన్ చూస్తే… ఈ షేర్ పాజిటివ్ ప్రతిఫలం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. అంతర్జాతీయ ఫిన్‌టెక్ కంపెనీలతో పోలిస్తే 15 శాతం డిస్కౌంట్‌తో ఈ షేర్ లభిస్తోందని తెలిపింది. 2022-25 మధ్యకాలంలో కంపెనీ ఆదాయం CAGR 35 శాతం ఉంటుందని పేర్కొంది. ఈ సంస్థ ఇచ్చిన టార్గెట్ రూ.1460 ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కూడా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చింది. నియంత్రణ సంస్థల నుంచి కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నా… కస్టమర్ల మానిటైజేషన్ పెరిగే అవకాశముందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంటోంది.ఈ సంస్థ ఇచ్చిన టార్గెట్ రూ.1352.