For Money

Business News

పెరగని మన బంగారం

అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్‌ ధరలు భారీగా పెరిగాయి. ఔన్స్‌ బంగారం ధర అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్‌లో రెండు శాతంపైగా పెరిగి 1749 డాలర్లకు చేరింది. ఇక వెండి మాత్రం ఒక శాతం పెరిగి 21.58 డాలర్లకు చేరింది. అయితే డాలర్‌ రెండు శాతంపైగా తగ్గడం వల్ల మన రూపాయి విలువ పెరిగింది. దీంతో మన బులియన్‌ మార్కెట్‌లో అదే స్థాయిలో ధరలు పెరగలేదు. ఫ్యూచర్‌ మార్కెట్‌లో డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ పది గ్రాముల ధర రూ. 509 పెరిగి రూ.52,015లకు చేరింది. కిలో వెండి డిసెంబర్‌ కాంట్రాక్ట్‌ ధర కేవలం 189 పెరిగి రూ.61,750కు చేరింది.