రూ. 54,000ని టచ్ చేసిన బంగారం
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, బులియన్ ధరల ప్రభావం మన మార్కెట్‌పై తీవ్రంగా పడుతోంది. బంగారం ధర స్వల్పంగా తగ్గినా… డాలర్ భారీగా పెరగడంతో బంగారం ధర రాత్రి ఎంసీఎక్స్ రూ. 54000ని టచ్ చేసింది. డాలర్‌తో రూపాయి బలహీనపడటంతో బులియన్ వ్యాపారుల పంట పండుతోంది. నిన్న రాత్రి ఏప్రిల్ బంగారం కాంట్రాక్ట్ రూ. 54010లకు తాకిన తరవాత రూ. 53,694 వద్ద ముగిసింది. నిన్న ఒక్క రోజే బంగారం కాంట్రాక్ట్ రూ.1135 పెరిగింది. ఇక వెండి కూడా రాత్రి ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఏప్రిల్ కాంట్రాక్ట్ రూ.71,340ని తాకి రూ. 70,190 వద్ద ముగిసింది. నిన్న వెండి రూ.904 లాభంతో క్లోజైంది. ఇవాళ ఉదయం బులియన్ మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.
స్పాట్ మార్కెట్లో
హైదరాబాద్‌లో నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.54 వేలకు దగ్గరైంది. నిన్న రూ.1,090 పెరిగి రూ.53,890కి చేరింది. 22 క్యారెట్ల స్టాండర్డ్ బంగారం కూడా రూ.1,000 పెరిగి రూ.49,400 పలికింది.