బంగారం ఢమాల్
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తాజా దాడులతో గల్ఫ్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గల్ఫ్‌లోని ఇతర దేశాల చమురు క్షేత్రాలపై దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించడంతో డాలర్ ఒక్కసారిగా పెరిగింది. క్రూడ్ 5 శాతం పెరిగింది. డాలర్ పెరగడంతో బులియన్ మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. అమెరికా మార్కెట్‌లో బంగారం ధరలు 3 శాతం తగ్గాయి. ఔన్స్ బంగారం ధర మళ్ళీ 5000 డాలర్ల దిగువకు వచ్చేసింది. ఇపుడు 4875 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక సిల్వర్ కూడా 4 శాతం దాకా తగ్గింది. మన మార్కెట్‌లో కూడా బులియన్ ధరలు బాగా పడ్డాయి. ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్ట్ రూ. 3500 నష్టంతో ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ. 1,51,690 వద్ద ట్రేడవుతోంది. ఇక సిల్వర్ మే కాంట్రాక్ట్ రూ. 6000 నష్టంతో ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ. 2,47,200 వద్ద ఉంది.
