గో ఫ్యాషన్ పబ్లిక్ ఆఫర్ ప్రారంభం నేడు
చెన్నైకు చెందిన గో ఫ్యాషన్ ఇండియా కంపెనీ పబ్లిక్ ఆఫర్ ఇవాళ ప్రారంభం కానుంది. ఈ కంపెనీ మహిళల దుస్తులను విక్రయిస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 1013 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో రూ.125 కోట్ల విలువైన షేర్లు మాత్రమే కొత్త షేర్లు. మెజారిటీ షేర్లు ఇపుడు కంపెనీలో ఉన్న ఇన్వెస్టర్లు అమ్మడానికి ఉద్దేశించినవి. ఇష్యూ ఇవాళ ప్రారంభమై… ఈనెల 22న ముగుస్తుంది. షేర్ ధరశ్రేణి రూ. 655-రూ. 690. కనీస లాట్ 21 షేర్లు. అంటే కనీస దరఖాస్తు మొత్తం రూ. 14,490. అనేక బ్రోకింగ్ సంస్థలు ఈ ఇష్యూకు దరఖాస్తు చేయమనే సలహా ఇస్తున్నాయి. మెజారిటీ సంస్థలు ఈ కంపెనీలో దీర్ఘకాలిక లాభాల కోసం పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు మాత్రం ఈ ఇష్యూకు కూడా లిస్టింగ్ లాభాలు ఉంటాయని అంటున్నారు. లిస్టింగ్ లాభాల కోసం కూడా ఈ ఇష్యూకు సబ్స్క్రయిబ్ చేయొచ్చు.