జీఎంఆర్ ఇన్‌ఫ్రా కొత్త లిస్టింగ్
జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇవాళ కేవలం ఎయిర్ పోర్ట్ బిజినెస్ సంస్థగా ట్రేడ్ కావడం ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో ఈ షేర్ రూ. 27.90 వద్ద ప్రారంభమైంది. చివర్లో రూ.28.10 వద్ద ముగిసింది. ఈ షేర్ క్రితం ముగింపు రూ. 48.45. ఎందుకంటే కంపెనీలో పవర్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మరో కంపెనీగా మార్చిన విషయం తెలిసింది. జీఎంఆర్ ఇన్‌ఫ్రాలో ఉన్న ఒక షేర్‌కు జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాకు చెందిన పది షేర్లకు గాను జీఎంఆర్ పవర్‌కు చెందిన ఒక షేర్ వస్తుంది. జీఎంఆర్ ఇన్‌ఫ్రా షేర్ ముఖ విలువ రూ.5కాగా, జీఎంఆర్ పవర్ షేర్ ముఖ విలువ రూ.1.