గ్లాండ్ ఫార్మా ఫలితాలు సూపర్
హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ .273 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదేకాలంతో పోలిస్తే లాభం 34 శాతం పెరిగింది. ఇదే సమయంలో టర్నోవర్ రూ .859 కోట్ల నుంచి 24 శాతం వృద్ధితో రూ.1,063 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి గ్లాండ్ ఫార్మా ఆదాయం రూ .3,297 కోట్లు కాగా, నికరలాభం రూ .925 కోట్లుగా నమోదయ్యాయి. అమెరికా మార్కెట్లో తమ అమ్మకాలు 23 శాతం పెరిగాయని, ఇతర దేశాల్లోనూ వృద్ధికి ప్రయత్నిస్తున్నట్లు గ్లాండ్ ఫార్మా సీఈఓ శ్రీనివాస్ సాదు తెలిపారు. మూడో త్రైమాసికంలో 4 సంక్లిష్ట ఇంజెక్టబుల్ ఔషధాలకు అనుమతి కోసం దరఖాస్తు చేశామన్నారు.