For Money

Business News

17400 దగ్గరగా నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి మించి ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది.17,370 పాయింట్ల వద్ద ఓపెనైన నిఫ్టి వెంటనే 17,339 పాయింట్లను తాకినా వెంటనే కోలుకుని ఏకంగా 17,395 స్థాయికి చేరింది. ప్రస్తుతం 17,379 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 113 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్‌ 380 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి అర శాతం లాభంతో ఉండగా, మిడ్‌ క్యాప్‌ నిఫ్టి 0.85 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 48 షేర్లు లాభంతో ఉన్నాయి. భారతీ ఎయిర్‌ టెల్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.