మన్మోహన్ సింగ్ కన్నుమూత

దేశ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో ఆయన ఇవాళ సాయంత్రం ఎయిమ్స్‌లో చేరారు. 33 ఏళ్ళ పాటు రాజ్యసభ సభ్యునిగా ఉన్న మన్మోహన్‌సింగ్ ఈ ఏడాదే రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు. మన్మోహన్ సింగ్ మరణ వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకున్నారు. సీడబ్య్లూసీ సమావేశం కోసం బెళగావిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీకి బయలుదేరారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా కొద్దిసేపటి క్రితం ఎయిమ్స్‌కు చేరుకున్నారు.