6l ఫస్ట్ క్రై ఐపీఓ ఓపెన్
ఆన్లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫస్ట్‌క్రై మాతృ సంస్థ అయిన బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ ఈనెల 6న ప్రారంభం కానుంది. ఈ ఆఫర్ మూడు రోజుల పాటు ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా ద్వారా కంపెనీ రూ.4,194 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఈ ఆఫర్లో ఒక్కో షేరు ధర శ్రేణిని రూ.440-465గా నిర్ణయించింది. ఐపీఓలో 75 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు. రీటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం షేర్లను ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇన్వెస్టర్లు ఐపీఓ కనీస అలాట్మెంట్ సైజు 32 షేర్లు. (లాట్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.పబ్లిక్ ఆఫర్ ద్వారా బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ రూ.1666 కోట్ల విలువైన కొత్త షేర్లను ఆఫర్ చేస్తుండగా… రూ.2,528 కోట్లకు సమానమైన 5.44 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు అమ్ముకుంటున్నారు. తమ వ్దద షేర్లలో సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన ఏవీఎఫ్ ఫ్రాగ్ 2.03 కోట్లు, మహీంద్రా అండ్ మహీంద్రా 28.06 లక్షల షేర్లను ఈ ఆఫర్ ద్వారా అమ్ముకుంటున్నారు. మరికొన్ని కంపెనీలు కూడా తమ వాటాను విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు 25.55 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రాకు 10.98 శాతం వాటా ఉంది.