For Money

Business News

ఫెడరల్‌ బ్యాంకు ఫలితాలు సూపర్‌

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫెడరల్‌ బ్యాంక్‌ రూ.488 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకుకు వచ్చిన రూ.315.70 కోట్ల లాభాలతో పోలిస్తే ఈ ఏడాది 55 శాతం వృద్ధి సాధించింది. ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గి రూ.4,071.35 కోట్ల నుంచి రూ.4,013.46 కోట్ల తగ్గింది. క్రితం ఏడాది రూ.3,591(0.99 శాతం) ఉన్న నికర నిరర్ధక ఆస్తులు 1.15 శాతానికి పెరిగి రూ.4,558 కోట్లకు చేరాయి. మొండి బకాయిలు, కంటింజెన్సీల నిమిత్తం గత క్రితం రూ.565.46 కోట్ల కేటాయింపులు చేయగా.. ఈసారి అవి రూ.264.53 కోట్లకు తగ్గాయి. ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటంతో బ్యాంక్‌ షేర్‌ ఇవాళ 7 శాతం లాభంతో రూ. 103.15 వద్ద ముగిసింది. అంతకుమునుపు రూ. 105.70ని కూడా తాకింది.