For Money

Business News

ఫెడ్‌ బ్యాంక్‌ నుంచి స్మయిల్‌ పే

ఫేషియల్‌ రికగ్నిషన్‌తో పేమెంట్‌ చేసేలా స్మయిల్‌ పేను ఫెడరల్‌ బ్యాంక్ ప్రారంభించింది. కస్టమర్లు తమ ఫేస్‌ రికగ్నైజేషన్‌తో చెల్లింపులు చేయడమే ఈ కొత్త పద్ధతి విశేషం. అంటే పేమెంట్‌ కోసం స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఇతర గ్యాడ్జెట్స్‌ అవసరంర లేకుండానే పే మెంట్‌ చేయొచ్చన్నమాట. UIDAIకి చెందిన భీమ్‌ ఆధార్‌పేతో రూపొందించిన అధునాతన ఫేషియల్‌ అథెంటికేషన్‌ టెక్నాలజీ ఆధారంగానే ఈ స్మయిల్‌ పే పనిచేస్తుంది. ఫెడరల్‌ బ్యాంక్‌ మర్చంట్లు తమ కస్టమర్‌ ఆధార్‌ నంబర్‌ ఎంటర్ చేశాక… మర్చంట్‌ మొబైల్ నుంచి కస్టమర్‌ ముఖాన్ని స్కాన్‌ చేస్తారు. ఉడాయ్‌ లోని ఫేషియల్‌ డేటా ఆధారంగా బ్యాంక్‌ దాన్ని ప్రాసెస్‌ చేస్తుంది. వెరిఫై అయిన వెంటనే చెల్లింపులు పూర్తయినట్లు ఒక వాయిస్‌ అలర్ట్‌ జనరేట్‌ అవుతుంది. దీంతో పేమెంట్‌ అయిన సంగతి వ్యాపారికి తెలుస్తుంది. ఒక్కో లావాదేవీకి రూ.5,000 వరకు పరిమితి ఉంటుందని, నెలకు రూ.50వేల వరకు చెల్లింపులు జరపొచ్చని ఫెడరల్‌ బ్యాంక్‌ తెలిపింది. అయితే ఈ సౌకర్యం పొందాలంటే తొలుత మర్చంట్‌ బ్యాంక్‌ ఖాతాను ఆధార్‌ కార్డ్‌తో లింక్‌ చేసుండాలి. ఒకసారి చేసుకుంటే… ఆ తరవాత మళ్ళీ చేయాల్సి పని ఉండదు.