For Money

Business News

నవంబర్‌లో మళ్ళీ కోత?

అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ నిన్న రాత్రి నాలుగేళ్ళ తరవాత వడ్డీ రేట్లను తగ్గించింది. మార్కెట్‌ అంచనాలకు మించి వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించింది. దీంతో స్టాండర్డ్‌ వడ్డీ రేట్ల శ్రేణి 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి 5.25-5.50 శాతం నుంచి 4.75-5.0 శాతానికి తగ్గింది. దేశ ఆర్థిక వృద్ధిని దృష్టి ఉంచుకుని మున్ముందు కూడా వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తామని ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అన్నారు. మార్కెట్‌ వర్గాల అంచనా ప్రకారం నవంబర్‌ నెలలో అర శాతం మేర వడ్డీ రేట్లు తగ్గవచ్చని తెలుస్తోంది. అయితే మెజారిటీ అనలిస్టులు మాత్రం పావు శాతం కచ్చితంగా తగ్గింపు ఉంటుందని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఒక శాతం, 2026లో మరో 0.50 శాతం తగ్గించే అవకాశాలున్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌ బాటలోనే మరిన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లూ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఇప్పటికే రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించింది. పావు శాతం చొప్పున రెండు శాతం తగ్గించింది. మనదేశంలో కూడా వచ్చే నెల వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది.

Leave a Reply