For Money

Business News

ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గించదా?

రెండు రోజుల ఫెడ్‌ సమావేశం మరికొన్ని గంటల్లో ముగియనుంది. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ నిర్ణయం కోసం మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. వాల్‌స్ట్రీట్‌ నష్టాల్లో ఉంది. ముఖ్యంగా నాస్‌డాక్‌ 0.7 శాతం నష్టంతో ఉంది. డౌజోన్స్‌ సూచీ క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది. దావోస్‌ సమావేశంలో వర్చువల్‌గా మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వడ్డీ రేట్లను తగ్గించాలని కోరారు. అయితే ఇదే సమయంలో వివిధ దేశాల దిగుమతులపై సుంకాలు విధిస్తామని కూడా ఆయన హెచ్చరించారు. అంటే దేశీయంగా వస్తువుల ధరలు పెరుగుతాయన్నమాట. పరోక్షంగా ట్రంప్‌ చర్యలు ద్రవ్యోల్బణానికి దారి తీస్తాయి. ఈ నేపథ్యంలో ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతానికి ఈ సమావేశంలో వడ్డీ రేట్లలో ఫెడ్‌ ఎలాంటి మార్పు చేయదని మెజారిటీ ఆర్థికవేత్తలు, బ్యాంకులు భావిస్తున్నారు. మరి ఫెడ్‌ నిర్ణయం ఎలా ఉంటుందో మరి.