ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు…
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ దాదాపు 28 ఏళ్ళ తరవాత ఒకేసారి 0.75 శాతం మేర వడ్డీ రేట్లను పెంచింది. రెండు రోజుల సుదీర్ఘ చర్చల తరవాత ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ వడ్డీ రేట్లను పెంచాలనే నిర్ణయానికి వచ్చింది. తొలుత అర శాతం మాత్రమే పెంచుతారనే చర్చ జరిగినా… గత వారం సీపీఐ డేటా చాలా ప్రోత్సాహకరంగా ఉండటం 40 ఏళ్ళ గరిష్ఠానికి చేరడంతో 0.75 శాతం పెంచాలని నిర్ణయించింది. వచ్చే జులై నెలలో కూడా మరో 0.75 శాతం పెంచుతుందని భావిస్తున్నారు. ఏడాది చివరికల్లా వడ్డీ రేట్లను 3.4 శాతానికి పెంచాలన్నది ఫెడ్ టార్గెట్గా కన్పిస్తోంది. అంటే ఏడాది చివరినాటికి మరో 1.75 శాతం పెంచుతారన్నమాట. ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తేవడమే లక్ష్యంగా తాము చర్యలు తీసుకుంటున్నట్లు ఫెడ్ స్పష్టం చేసింది.