ట్రంప్ ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. అమెరికా కాలమాన ప్రకారం సోమవారం ఉదయం పది గంటలకు ట్రంప్‌కు చెందిన మార్ ఏ లాగో ఎస్టేట్‌పై ఎఫ్‌బీఐ దాడులు జరిపినట్లు స్వయంగా ట్రంప్ వెల్లడించారు. తన ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు చేస్తోందని ట్రంప్ నిన్న రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. దాడులు జరిగినపుడు ట్రంప్ ఇంటిలో లేరు. అధ్యక్ష పదవి నుంచి ఆయన వైదొలిగిన తరవాత వైట్ హౌస్ నుంచి 15 బాక్సుల్లో డాక్యుమెంట్లను ట్రంప్ తీసుకు వెళ్ళారని అమెరికా మీడియా రాస్తోంది. మార్ ఎ లాగో ఇంటికి తీసుకు వెళ్ళని పత్రాల్లో నేషనల్ ఆర్కివ్స్కు చెందిన పత్రాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో కొన్ని రహస్య పత్రాలు కూడా ఉన్నాయని అమెరికా మీడియా రాస్తోంది. జనవరిలో ట్రంప్ నేషనల్ ఆర్కివ్స్కు పత్రాలను ఇచ్చేశారని, మరిన్ని పత్రాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారేమోనని ట్రంప్ లాయర్ అన్నారు. ఈ వార్తలపై ఇటు ఎఫ్‌బీఐ కాని లేదా న్యాయ విభాగం గాని ఇప్పటి వరకు స్పందించలేదు.