ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి తీపికబురు!
ప్రస్తుతం ఫేమ్ 2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ బైకులు, కార్లు కొనేవారికి భారీ సబ్సిడీ లభిస్తోంది. ఈ ఫేమ్ 2 స్కీమ్ గడువు తేదీని పొడగించాలని చూస్తున్నట్లు సమాచారం. ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీ గడువు తేదీని మార్చి 31, 2024 వరకు పొడగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సబ్సిడీ మార్చి 31, 2022 వరకు కొనసాగనుంది. ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్‌కి మద్దతుగా ఈ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీని రెట్టింపు చేసింది. ఈవీ వెహికల్స్ తయారీకి సంబంధించి కిలోవాట్ పర్ అవర్ సామర్థ్యం కలిగిన బైక్ తయారీ ధరలో 20 శాతంగా ఉన్న సబ్సిడీని 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో 1 kWh సామర్థ్యం కలిగిన బైక్‌పై రూ.15,000 సబ్సిడీ లభిస్తోంది. ఇలా 2 kWh బైక్‌పై రూ. రూ.30,000 సబ్సిడీ 3 kWh బైక్‌పై రూ. 45,000 వరకు సబ్సిడీ లభిస్తోంది. లక్షన్నర ధర మించని బైకులకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది.