For Money

Business News

ఫేస్‌బుక్‌ దెబ్బకు నాస్‌డాక్‌ ఢమాల్‌

అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయనడానికంటే భారీ నష్టాల్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ అద్భుత ఫలితాల తరవాత కూడా ఎస్‌ అండ్‌ 500 సూచీ 0.32 శాతం నష్టంతో ట్రేడవుతోంది. మరోవైపు ప్రైవసీకి సంబంధించిన నిబంధనలను ఫేస్‌బుక్‌ మార్చడం వల్ల తన లాభదాయకత దెబ్బతిందని స్నాప్‌ కంపెనీ వెల్లడించింది. దీంతో స్నాప్‌ కంపెనీ షేర్‌ 22 శాతం క్షీణించగా.. ఫేస్‌బుక్‌ 5 శాతం, ట్విటర్‌ 3.2 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అలాగే అంచనాలను అందుకోవడంలో ఇంటెల్‌ ఘోరంగా విఫలమైంది. దీంతో ఆ కంపెనీ షేర్‌ 11 శాతం నష్టపోయింది. వెరశి నాస్‌డాక్‌ ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. మరోవైపు కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ స్థిరంగా ఉంది. 93.71 వద్ద డాలర్‌ ఇండెక్స్‌ ట్రేడవుతోంది. గత రెండు రోజుల నష్టాల తరవాత క్రూడ్‌ ఆయిల్‌ లాభాల్లోకి వచ్చింది. బ్రెంట్ క్రూడ్‌ మళ్ళీ 75 డాలర్లను దాటింది. డాలర్‌ బలహీనపడటం, డాలర్‌ ఇక పెరగడం కష్టమని వార్తలు వస్తున్న నేపథ్యంలో బులియన్‌ గ్రీన్‌లో ఉంది. బంగారం మళ్ళీ 1800 డాలర్లకు, వెండి 24.5 డాలర్లకు చేరువ అవుతున్నాయి.