For Money

Business News

NIFTY TRADE: పెరిగితే అమ్మండి

నిన్నటి వ్యూహాన్నే ఇవాళ కూడా అమలు చేస్తున్నారు వీరందర్‌ కుమార్‌. నిఫ్టికి ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్స్‌ ఇవాళ. 17450-17510 మధ్య కాల్‌ రైటింగ్‌ చాలా జోరుగా ఉన్నందున నిఫ్టి ఈ స్థాయిని దాటే ఛాన్స్‌ లేదని ఈయన అంటున్నారు. నిన్న కూడా నిఫ్టి 17490ని తాకి వెనక్కి రావడానికి ఇదే కారణమని అంటున్నారు. అలాగే పుట్‌ రైటింగ్‌ 17200 ప్రాంతంలో ఉంది. అంటే ఇది సపోర్ట్‌ జోన్‌ అనుకోవాలి. ఒకవేళ నిఫ్టి గనుక పడితే 17236 లేదా 17191 వద్ద కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. అలాగే పెరిగితే 17391 వద్ద తొలి ప్రతిఘటన ఎదురు అవుతుందని లేదంటే 17456 వద్ద రెండో ప్రతిఘటన వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు.17260-17300 మధ్య బై జోన్‌ ఉందని, అలాగే 17474 ప్రాంతంలో బయటపడమని సలహా ఇస్తున్నారు. బ్యాంక్‌ నిఫ్టితో పాటు ఇతర లెవల్స్‌ కోసం ఈ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=t6TZYPWVZws