For Money

Business News

మెట్రో బ్రాండ్స్‌ ఫలితాలు అదుర్స్‌

జూన్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో మెట్రో బ్రాండ్స్‌ కంపెనీ అద్భుత పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్నాలిడేటెడ్‌గా చూస్తే రూ. 507.9 కోట్ల టర్నోవర్‌పై రూ. 105.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.131 కోట్ల టర్నోవర్‌పై రూ.12 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అద్భుత పనితీరు ప్రారంభించామని కంపెనీ సీఈఓ నిసాన్‌ జోసెఫ్‌ అన్నారు. కంపెనీ నికర లాభ మార్జిన్‌ ఏడాదిలో మైనస్‌ 9.2 శాతం నుంచి 20.8 శాతానికి చేరిందని ఆయన వెల్లడించారు.