వచ్చేనెల బిడ్స్‌కు ఆహ్వానం
కొన్ని కీలక సంస్థల్లో వాటా విక్రయ ప్రక్రియ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. వీటిలో ముఖ్యమైంది… ఐడీబీఐ బ్యాంక్ అమ్మకం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అమెరికాలో రోడ్‌షోలను పూర్తి చేసినట్లు సమాచారం. ఇంకా కొన్ని అంశాలపై కేంద్రం నుంచి స్పష్టత కోరుతున్నారు. బ్యాంకులో ప్రమోటర్లు పూర్తి వాటా తీసుకున్నాక… తమ వాటా తగ్గించుకోవడానికి సమయం కోరుతున్నారు కొందరు బిడ్డర్లు. అలాగే బిడ్ చేసే కన్సార్షియంలో ఎవరెవరు ఉండాలి? ఎలా ఉండాలనే అంశంపై కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నారు. జులైలో నెలలో బిడ్స్‌ను ప్రభుత్వం ఆహ్వానించవచ్చని తెలుస్తోంది. సాధ్యమైనం త్వరగా ఈ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది. ఐడీబీఐ బ్యాంక్‌తో పాటు షిప్పింగ్ కార్పొరేషన్, బీఈఎంఎల్, ఎన్ఎండీసీ సంస్థల్లో కీలక వాటాను విక్రయించేందుకు మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది.