For Money

Business News

హర్యానా: కాంగ్రెస్‌ పక్కా?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఇంకా ఎన్నికల పొత్తులు ఖరారు కాక ముందే టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ ముందున్నా హంగ్‌కు ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం 90 స్థానాలు ఉన్న ఈ అసెంబ్లీలో కాంగ్రెస్‌ కూటమికి 38 నుంచి 41 స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ సర్వే పేర్కొంది. బీజేపీ కూటమికి 33 నుంచి 38 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇపుడు అధికారంలో ఉన్న బీజేపీకి కూటమికి 42 స్థానాలు ఉండగా,కేవలం బీజేపీకే 40 స్థానాలు ఉన్నాయి. అయితే ఈసారి ఆ స్థాయిలో సీట్లు బీజేపీకి కష్టంగా కన్పిస్తోంది.
ఆప్‌తో పొత్తు
ఈ సర్వే కాంగ్రెస్‌-ఆప్‌ పొత్తుకు ముందు చేసినవి. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య పొత్తు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ప్రకటన వెలువడే అవకాశముంది. తమకు పది సీట్లు కావాలని ఆప్‌ కోరుతుండగా, ఏడు సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ రెడీ ఉంది. మొత్తానికి పొత్తు ఖాయమని తెలుస్తోంది. ఇదే జరిగితే ఈసారి హర్యానాలో కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జేజేపీ ఇపుడు రెండు సీట్లు ఉండగా, టౌమ్స్‌ నౌ సర్వే ప్రకారం 2 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశముంది. అయితే కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పొత్తు ఖరారైతే ఇతరులకు ఇచ్చిన ఆరు నుంచి 11 స్థానాలు ఉండవని విశ్లేషకులు అంటున్నారు. ఈనెల 12న ఈ రాష్ట్రంలో నామినేషన్లకు ఆఖరు. అక్టోబర్‌ 5న ఎన్నికలు జరుగాయి. 8న ఫలితాలు వెలువడుతాయి.