For Money

Business News

దేశంలో టాప్‌ దానకర్ణులు

తన సంపాదనలో దాన ధర్మాలకు వెచ్చిన పారిశ్రామికవేత్తల్లో విప్రో వ్యవస్థాపకులు అజీమ్‌ ప్రేమ్‌జీ అందరికంటే ముందున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.9,713కోట్లు దాతృత్వానికే వెచ్చించారు. అంటే సగటును రోజుకు రూ.27కోట్లు ఆయన దానం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రేమ్‌జీ దాతృత్వం నాలుగింతలు పెరిగిందని ఎడిల్‌గివ్‌ హురన్‌ ఇండియా పేర్కొంది. దేశంలో ఇలా దానధర్మాలు చేసే పారశ్రామికవేత్తల ఫిలాంథ్రఫీ జాబితా-2021ను వెల్లడించింది. అజీమ్‌ ప్రేమ్‌జీ తర్వాత హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ శివనాడర్ రూ.1,263 కోట్లతో రెండో స్థానంలో నిలవగా… దేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్‌ ఇండస్ట్రీ ముఖేష్‌ అంబానీ రూ.577 కోట్లతో మూడో స్థానంలో ఉండగా, కుమార మంగళం బిర్లా రూ.377 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నందన్‌ నీలేకని రూ.183 కోట్ల దానంతో ఐదో స్థానంలో ఉన్నారు.