For Money

Business News

ఎబిక్స్‌ క్యాష్ ఐపీఓ త్వరలో

డిజిటల్‌ ప్రొడక్ట్‌ అండ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అయిన ఎబిక్స్ క్యాష్ పబ్లిక్ ఇష్యూకు రెడీ అయింది. సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ .6,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేయనుండటం విశేషం. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను అనుబంధ సంస్థలైన ఎబిక్స్ ట్రావెల్స్ , ఎబిక క్యాష్ వరల్డ్ మనీల మూలధన అవసరాలకు, వ్యూహాత్మక కొనుగోళ్లకు, పెట్టుబడులకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు వినియోగించనుంది. ఈలోగా రూ. 1200 కోట్ల రైట్స్‌ ఇష్యూ కూడా చేసే అవకాశముంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 4152 కోట్ల టర్నోవర్‌పై రూ. 230 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.