For Money

Business News

20 శాతం పెరిగిన ఈజ్‌ మై ట్రిప్‌

కొత్త స్కీమ్‌ను ప్రారంభించడంతో ఈజ్‌ మై ట్రిప్‌ షేర్‌ ఇవాళ 20 శాతం లాభంతో ట్రేడవుతోంది. వరుసగా నాలుగు సెషన్ష్ నుంచి నష్టాల్లో ఉన్న ఈ షేర్‌ ఇవాళ 20 శాతం లాభంతో రూ. 54.70ని తాకింది.’EMTFAMILY’ పేరుతో కొత్త స్కీమ్‌ను ఈ కంపెనీ ప్రవేశ పెట్టింది. ఈ స్కీమ్ కింద కొత్త కస్టమర్‌ను రెఫెర్‌ చేసిన వారికి అనేక రకాల బహుమతులను కంపెనీ ప్రకటించింది. ఒక ఏడాది పాటు స్కీమ్‌ లాభాలు పొందవచ్చని కంపెనీ పేర్కొంది.