For Money

Business News

18100 చేరువలో నిఫ్టి

నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18090ని తాకింది. ఇపుడు 18096 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 82 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 279 పాయింట్ల లాభంతో ఉంది. జనవరి 8 నుంచి కోవిడ్‌ సంబంధిత ఆంక్షలను సడలించనున్నట్లు చైనా ప్రకటించడంతో పలు మెటల్‌ షేర్లతో పాటు చైనాతో లింక్‌ ఉన్న షేర్లలో చిన్న పాటి ర్యాలీ కన్పిస్తోంది. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌లో చక్కటి ర్యాలీ కన్పిస్తోంది. అలాగే నిఫ్టి నెక్ట్స్‌ కూడా . ఈ రెండు సూచీలు 0.8 శాతం పైగా లాభపడ్డాయి. మదర్‌ డెయిరీ పాల ధరను పెంచడంతో దాదాపు అన్ని డెయిరీ కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. హెరిటేజ్‌ ఫుడ్స్‌ 4 శాతం దాకా లాభపడింది. హెచ్‌ఈజీ కూడా 5 శాతం పెరిగింది. ఇక బ్యాంక్‌ షేర్లలో అప్‌ట్రెండ్‌ కొనసాగుతోంది. దాదాపు అన్ని మధ్యతరహా బ్యాంకుల షేర్లు ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. టాటా మోటార్స్‌, మెటల్‌ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ షేర్లను రెకమెండ్‌ చేస్తున్నారు.