ఓపెనింగ్‌లోనే అమ్మకాల ఒత్తిడి
ఓపెనింగ్‌లోనే నిఫ్టి ఇవాళ్టి మద్దతు స్థాయి 15,681ని తాకింది. నిఫ్టికి 15680-15670 మధ్యలో మద్దతు అందాలి. లేనిపక్షంలో నిఫ్టి 15,610 వరకు మద్దతు లేదు. 15660-15650 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చు. నిఫ్టి నిన్నటి ముగింపు వరకు వెళ్ళే అవకాశముంది. ఏసీసీ, పెయింట్ కంపెనీలు తప్ప దాదాపు అన్ని కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. నిఫ్టి ప్రస్తుతం 50 పాయింట్ల నష్టంతో 15,702 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్‌ను బ్యాంక్ నిఫ్టిని భారీగా దెబ్బతీసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో మొత్తం బ్యాంకింగ్ షేర్ల రీరేటింగ్ సాగుతోంది. బ్యాంక్ నిఫ్టి ఇవాళ కూడా ఒక శాతంపైగా నష్టపోయింది. నిఫ్టిలో ఏకంగా 30 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మిడ్ క్యాప్ షేర్ల సూచీ స్వల్ప నష్టాలకే పరిమితం కావడం కాస్త ఊరట కల్గించే అంశం. మార్కెట్‌కు రేపు సెలవు.
నిఫ్టి టాప్ గెయినర్స్
అల్ట్రాటెక్ సిమెంట్ 7,438.20 1.72
శ్రీసిమెంట్ 28,432.50 1.56
పవర్‌గ్రిడ్ 236.10 1.27
ఏషియన్ పెయింట్స్ 3,015.40 1.12
గ్రాసిం 1,575.15 1.05
నిఫ్టి టాప్ లూజర్స్
హెచ్‌సీఎల్ టెక్ 977.50 -2.27
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1,442.25 -1.95
ఓఎన్జీసీ 113.10 -1.31
భారతీ ఎయిర్టెల్ 532.15 -1.17
సిప్లా 962.70 -1.16