ఆగని క్రిప్టో కరెన్సీల పతనం
ఫెడ్ నిర్ణయం దగ్గర పడుతున్న కొద్దీ రిస్క్ అధికంగా ఉన్న పెట్టుబడి సాధానాల్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. ఐటీ, టెక్ షేర్ల తరవాత క్రిప్టో కరెన్సీపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. గత ఏడాది జులై తరవాత బిట్ కాయిన్ 33000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 33745 డాలర్ల వద్ద 4.5 శాతం నష్టంతో బిట్ కాయిన్ ట్రేడవుతోంది. ఇక ఎథీరియం 9 శాతంపైగా నష్టంతో 2213 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బీఎన్బీ, కార్డానొ కూడా పది శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. మన మార్కెట్లో బిట్‌కాయిన్ 5.5 శాతం నష్టంతో రూ. 27,99,000, ఎథెర్ రూ. 1,85,000 వద్ద ట్రేడవుతున్నాయి. లైట్‌కాయిన్ 6శాతం నష్టంతో రూ.8420, పాలిగాన్ 12 శాతం నష్టంతో రూ. 114 ట్రేడవుతోంది. ఇక బిట్ కాయిన్ క్యాష్ 4.5 శాతం నష్టంతో రూ.23,385 వద్ద ట్రేడవుతోంది.