పసిడి: కొనసాగుతున్న పతనం
అంతర్జాతీయ మార్కెట్‌లో మెటల్స్ ధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా బులియన్ ధరలు రెండో రోజు కూడా క్షీణించాయి. ఈక్విటీ మార్కెట్లు నిలకడగా ఉన్నా అమెరికా డాలర్ విలువ ఇవాళ కూడా పెరిగింది. డాలర్ ఇండెక్స్ 105పైన పటిష్ఠంగా ఉంది. పదేళ్ళ బాండ్ ఈల్డ్స్ మరో 3 శాతం పెరగడంతో 3.44 శాతానికి చేరింది. దీంతో బులియన్ మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. బంగారం, వెండి రెండూ ఒకశాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. మన కమాడిటీస్ మార్కెట్‌లో బులియన్ ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతోంది. స్టాండర్డ్ బంగారం ఫ్యూచర్స్ మార్కెట్‌లో జూన్ కాంట్రాక్ట్ రూ.456 తగ్గి రూ. 50208 వద్ద ట్రేడవుతోంది. కివో వెండి రూ.920 తగ్గి రూ. 59411 వద్ద ట్రేడవుతోంది.