10వ రోజూ డౌజోన్స్ అప్
నిన్న భారీగా క్షీణించిన నాస్డాక్ ఇవాళ నిలకడగా ట్రేడవుతోంది. తాజా సమాచారం మేరకు 0.09 శాతం నష్టంతో ఉంది. అయితే డౌజోన్స్లో మాత్రం ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతోంది. వరుసగా పదో రోజు డౌజోన్స్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం డౌజోన్స్ 0.23 శాతం లాభంతో ఉంది. ఎస్ అండ్ పీ 500 కూడా ఇదే స్థాయి లాభాలతో ట్రేడవుతోంది. డాలర్ ఇవాళ కూడా బలపడింది. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 101కు చేరువగా ఉంది. డాలర్ బలం కారణంగా బులియన్ కాస్త డీలా పడింది. అయితే క్రూడ్ ఆయిల్ మాత్రం లాభాల్లో కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 81 డాలర్లకు చేరువలో ఉంది. మరో గిఫ్టి నిఫ్టి నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 19765 వద్ద ట్రేడవుతోంది.