వరుసగా ఆరో రోజూ డౌ పతనం
అమెరికా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. కాకపోతే భారీ నష్టాల బదలు రాత్రి స్వల్ప నష్టాలతో ముగిశాయి. డౌజోన్స్ వరుసగా ఆరో రోజు కూడా నష్టాలతో ముగిసింది. రాత్రి డౌజోన్స్ 0.33 శాతం. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.13 శాతం నష్టంతో క్లోజ్ కాగా, నాస్ డాక్ 0.06 శాతం లాభంతో ముగిసింది.మార్కెట్ స్థిరంగా ముగిసిందన్నమాట. ఎస్ అండ్ పీ 500 సూచీ 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి 18 శాతం క్షీణించింది. ఆల్‌టైమ్ హై నుంచి నాస్డాక్ 30 శాతం పడింది. అలాగే యాపిల్ వంటి షేర్లు కూడా 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి 22 శాతం క్షీణించాయి. ద్రవ్యోల్బణం మార్కెట్‌కు ఇపుడు పెద్ద విలన్‌గా మారింది. 40 ఏళ్ళ గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణంతోపాటు డాలర్ కూడా మార్కెట్‌ను దెబ్బతీస్తోంది.