For Money

Business News

దిగువ స్థాయిలో నో షార్టింగ్‌

మార్కెట్‌ నష్టాలతో ఓపెనైనా… ప్రారంభమయ్యాక క్షీణించినా నిఫ్టిని షార్ట్‌ చేయొద్దని డేటా అనలిస్ట్‌ వీరేందర్ సలహా ఇస్తున్నారు. నిఫ్టి కేవలం అదిక స్థాయిలోనే షార్ట్‌ చేయమని అంటున్నారు. 16000, 16200 ప్రాంతంలో పుట్‌ రైటింగ్‌ 16400, 16500 ప్రాంతంలో కాల్‌ రైటింగ్ జోరుగా ఉన్నందున నిఫ్టి ఈ లెవల్స్‌ మధ్యే కదలాడే అవకావముంది. నిఫ్టి 16250ని దాటితే మరో వంద పాయింట్లు పెరిగే అవకాశముందని..16350-16400 మధ్య షార్ట్‌ చేయొచ్చని అన్నారు. నిఫ్టికి దిగువన 16151, 16066 ప్రాంతంలో మద్దతు, 16248, 16329 ప్రాంతంలో ప్రతి ఘటన రావొచ్చని పేర్కొంటున్నారు. నిఫ్టి,బ్యాంక్‌ నిఫ్టి లెవల్స్‌ కోసం దిగువ వీడియో చూడగలరు.