NIFTY TRADE: అప్పటి వరకు నో షార్ట్
మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. భారీ స్థాయిలో వీరు క్యాష్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. అలాగే ఫ్యూచర్స్‌లో పుట్ రైటింగ్ భారీగా ఉంది. దీంతో నిఫ్టి భారీగా క్షీణించకపోవచ్చు. కాని విదేశీ ఇన్వెస్టర్లు సేఫ్ ట్రేడింగ్ కోసం కాల్ రైటింగ్ కూడా బాగానే చేశారు. నిఫ్టి 16490 దిగువకు వచ్చే వరకు షార్ట్ చేయొద్దని వీరేందర్ సలహా ఇస్తున్నారు. అమెరికా ఫ్యూచర్స్ రెడ్‌లో ఉండటం, రేపు మన మార్కెట్‌కు సెలవు కావడంతో షార్ట్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ్టి ట్రేడ్‌ను ఇవాళే క్లోజ్ చేయండి. లాంగ్ పొజిషన్‌లోఉన్నవారు 16500 స్టాప్‌లాస్‌తో కొనసాగించవచ్చు. యుద్ధ సమయంలో చిన్న ఇన్వెస్టర్లు ఇండెక్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం మంచిది. ఇక వీరేందర్ అంచనా మేరకు నిఫ్టికి ఎగువ స్థాయిలో 16721 లేదా 16766 వద్ద ప్రతిఘటన వచ్చే అవకాశముంది. అదే పడితే 16550 వద్ద తొలి మద్దతు అందనుంది నిఫ్టికి. లేదంటే 16490 ప్రాంతంలో మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు స్థాయిల దిగువకు వస్తే మాత్రం 16450,16418 వద్ద మద్దతు లభిస్తుందని వీరేందర్ అంచనా వేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టి లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=vMPI6LBfDHE