మార్కెట్‌కు దూరంగా ఉండండి
మార్కెట్లో తీవ్ర అనిశ్చితిలో ఉందని… మార్కెట్ స్థిరపడే వరకు సాధారణ ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిదని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభించినా.. ఎంత వరకు పెరిగుతుందో చెప్పలేమని… భారీ గ్యాప్‌డౌన్‌తో నిఫ్టి ప్రారంభం అవుతున్నందున… షార్ట్ చేయమని సలహా కూడా ఇవ్వలేమని అన్నారు. ఇపుడున్న పరిస్థితులను చూస్తుంటే నిఫ్టికి 16900 ప్రాంతంలో మద్దతు లభించే అవకాశముందని సుఖాని అభిప్రాయపడ్డారు. అప్పటి దాకా ఇన్వెస్టర్లు వేచి చూడాలని అన్నారు. 16900 వద్ద మద్దతు లభిస్తుందేమో చూసి.. అపుడు నిర్ణయం తీసుకోవచ్చిన ఆయన అన్నారు. షేర్ల విషయానికొస్తే ఏషియన్ పెయింట్ షేర్‌ను పొజిషనల్ ట్రేడ్‌గా కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గడం ఈ కంపెనీకి బాగా కలిసి వచ్చే అంశం.