పెరిగితే అమ్మండి..
మార్కెట్లో ఏమాత్రం బలం లేదని, ప్రధాన మద్దతు స్థాయిలో కోల్పోయిన నిఫ్టిని… పెరిగినపుడల్లా అమ్మమని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. ఇవాళ ఆయన సీఎన్‌బీఐ టీవీ18తో మాట్లాడుతూ… క్రూడ్ ధరలు తగ్గినందున మార్కెట్‌కు పాజిటివ్ అని చాలా మంది భావిస్తున్నారని… ఒకవేళ పెరిగితే 15400 దాటితే నిఫ్టిని అమ్మమని ఆయన సలహా ఇచ్చారు. షేర్లను ప్రస్తుత ధరల్లో కొనే సాహసం చేయొద్దని ఆయన హెచ్చరించింది. బై ఆన్ డిప్స్ ఫార్ములాను మార్కెట్ ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేయదని ఆయన అన్నారు. నిఫ్టిని అమ్మడం కంటే.. పుట్స్‌ను కొనుగోలు చేయమని ఆయన సలహా ఇచ్చారు. మెటల్స్ డే ట్రేడింగ్‌కే కాదు.. పొజిషనల్ ట్రేడింగ్‌కు కూడా అమ్మొచ్చని ఆయన సలహా ఇచ్చాడు.