ఆప్షన్ ట్రేడర్స్‌కు అశ్విని సలహా
మార్కెట్ వెంటనే పెరుగుతుందనే ఆశలను వొదులుకోవాలని ఇన్వెస్టర్లకు ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అశ్విని గుజ్రాల్ అంటున్నారు. నిఫ్టిలో కాస్త పుల్ బ్యాక్ వచ్చినా… అంతిమంగా పడటానికి ఛాన్స్ ఉందని అంటున్నారు. మార్కెట్లో త్వరలోనే రివర్సల్ రావడం కష్టమని ఆయన అంటున్నారు. నిఫ్టికి 16700 ప్రాంతంలో కాస్త మద్దతు లభించినా.. అంతిమంగా 16500వైపు నిఫ్టి పయనిస్తుందని ఆయన అన్నారు. సెల్ ఆన్ రైజ్ ఇపుడు మార్కెట్ ట్రెండ్ అని అన్నారు. నిఫ్టి ఇవాళ పెరిగినా నిలబడకపోవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని అశ్విని సూచించారు. ముఖ్యంగా ఆప్షన్స్‌లో అనేక రెట్ల లాభమే టార్గెట్‌తో ట్రేడ్ చేయొద్దని ఆయన సూచించారు. అవకాశం కోసం ఎదురు చూడాలని… అవకాశం వచ్చిన వెంటనే లాభం తీసుకుని.. ట్రేడింగ్ నుంచి దూరంగా ఉండాలని ఆయన అన్నారు. కేవలం 20 లేదా 50 శాతం లాభంతో సంతృప్తి పడాలని ఆయన సూచించారు.