రైల్వే కేటాయింపులో వివక్ష
రైల్వే కేటాయింపుల్లో మోడీ ప్రభుత్వం దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేస్తోందని డీఎంకే ఎంపీ కళిమొని ఆరోపించారు. ఆమె పార్లెమెంటులో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ అంటూ పెద్దగా ప్రచారాలు చేస్తోందని… తీరా కేటాయింపులు వరకు వచ్చే సరికి తీవ్ర వివక్ష చూపుతోందని ఆమె ఆరోపించారు. 2022-23 రైల్వే బడ్జెట్‌లో కొత్త రైల్వే లైన్లకు చేసిన కేటాయింపులను చూస్తే ఉత్తరాదికి రూ. 13,200 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం దక్షిణాదికి కేవలం రూ. 59 కోట్లు కేటాయించిందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం దక్షిణాదిలో ఆపేసిన రైళ్ళను ప్రారంభించాలని, బడ్జెట్‌ను పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.