6 కోట్ల షేర్లకు…. నో సెల్లర్
బజాజ్ గ్రూపునకు చెందిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ ఇవాళ చరిత్ర సృష్టించింది. ఇవాళ లిస్టింగ్ అయిన ఈ షేర్ ఏకంగా 135 శాతం లాభపడి రూ. 165కి చేరింది. ఉదయం రూ. 146కి చేరిన షేర్.. క్రమంగా కోలుకుంటూ వచ్చింది. మిడ్ సెషన్ కల్లా అమ్మకందారులు లేకుండా పోయారు. బీఎస్‌ఈలో 36 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 6 కోట్ల షేర్లకు కొనుగోలుదారులు ఉన్నారు. రూ. 165 సీలింగ్ ధర వద్ద కూడా ఎన్‌ఎస్‌ఈలో 4 కోట్లకుపైగా బయ్యర్లు ఉన్నారు. ఈ షేరు ఇష్యూ గరిష్ఠ ధర రూ.70 కాగా.. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో రూ.150తో లిస్ట్ అయ్యింది. ఓపెనింగ్‌లోనే కంపెనీ మార్కెట్ విలువ రూ.1 కోట్లను దాటింది.