డెల్టా కార్ప్ నుంచి గుడ్ న్యూస్
క్యాసినోలు, హాటల్స్ నిర్వహిస్తున్న డెల్టా కార్ప్ కంపెనీ డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది.అలాగే కంపెనీలో ప్రస్తుతం భాగంగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ బిజినెస్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ. 74.72 కోట్ల టర్నోవర్‌పై రూ.22.57 కోట్ల నికర నష్టం ప్రకటించిన కంపెనీ.. డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ.247.22 కోట్ల టర్నోవర్‌పై రూ.70.38 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ ఇప్పటి వరకు ఆన్ లైన్ గేమింగ్ వ్యాపారాన్ని గసియాన్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్వహిస్తోంది. ఈ కంపెనీ వ్యాపారాన్ని విడగొట్టి … స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. లిస్టింగ్ ద్వారా వచ్చే నిధులను కంపెనీ విస్తరణకు ఉపయోగిస్తామని పేర్కొంది. ఈ కంపెనీకి ఎలాంటి రుణాలు లేవు. ఇవాళ షేర్ ఎన్ఎస్ఈలో 5 శాతం పెరిగి రూ.299కి చేరింది.