సిలికాన్ వ్యాలీకి డీప్‌సీక్ షాక్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో డీప్ సీక్ పెను సంచలనంగా మారింది. కేవలం 2023లో నెలకొల్పిన చైనా కంపెనీ రూపొందించిన డీప్‌సీక్ v3 ఇపుడు ప్రపంచ ఏఐ మార్కెట్‌ను కుదిపేస్తుంది. కొన్ని లక్షల కోట్లను ధారపోసి అమెరికా కంపెనీలు అభివృద్ధి చేసిన ఛాట్‌జీపీటీ, జెమిని, క్లౌడ ఏఐల పనితీరు డీప్‌సీక్ ముందు వెలవెల బోతోంది. యాపిల్ యాప్ స్టోర్‌లో డీప్‌సీక్ రికార్డులు నెలకొల్పుతోంది. ఓపెన్ సోర్స్ ఏఐ టూల్ అయిన డీప్‌సీక్ ఇపుడు ఆ రంగంలో టాప్ రేటెడ్ ఫ్రీ యాప్‌గా నిలిచింది. ఇపుడు టెక్ రంగంలో ఎక్కడ చూసినా ఈ యాప్‌పైనే చర్చ. చాలా తక్కువ ఖర్చుతో అద్భుతంగా పనిచేస్తున్న డీప్‌సీక్ యాప్ వినియోగదారులు అమెరికా, బ్రిటన్, చైనాలో సునామీలా పెరుగుతున్నాయి. 2023లో హాంజెహు నగరంలో లియాంగ్ వెన్‌ఫెంగ్ అనే ఇంజినీర్ డీప్‌సీక్‌ను అభివృద్ధి చేశారు. ఏఐ, క్వాంటిటేవ్ ఫైనాన్స్‌లో అనుభవం ఉన్న ఈ చైనా ఇంజినీర్ ఇపుడు సిలికాన్ వ్యాలీలో హాట్‌టాపిక్‌గా మారారు. R1 పేరుతో ఇటీవల డీప్‌సీక్ విడుదల చేసిన యాప్… ఓపెన్‌ఏఐ, యాంథ్రోఫిక్‌లను వెనక్కి నెట్టేసింది. తక్కువ ఖర్చు. ఓపెన్ సోర్స్ కావడంతో పాటు ఎలాంటి ఖర్చు లేకండా వాడుకోవడానికి వీలుగా ఉన్న ఈ యాప్ ఇపుడు సిలికాన్ వ్యాలీకి గుదిబండగా మారింది. అత్యాధునిక టెక్నాలజీ, భారీ పెట్టుబడి అవసరం లేకుండా వచ్చిన ఈ యాప్ ఇపుడు ఐటీ రంగాన్ని ముఖ్యంగా ఏఐ రంగాన్ని కుదిపేస్తోంది. ఈ దెబ్బతో సిలికాన్ కంపెనీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మున్ముందు చైనా నుంచి ఇంకెలాంటి టెక్ యాప్స్ వస్తోయోనన్న బెంగ ఇపుడు అమెరికాలో నెలకొంది.
డీప్‌సీక్… ఉచితం, ఓపెన్ సోర్స్, ఎవరైనా… ఎంతైనా వాడుకోవచ్చు.