దీపక్ పరేఖ్ గుడ్ బై
హెచ్డీఎఫ్షీ సంస్థ ప్రారంభం నుంచి చివరి వరకు ఛైర్మన్‌గా ఉన్న దీపక్ పరేఖ్ ఎట్టకేలకు గుడ్‌బై చెప్పారు. ఇవాళ్టితో హెచ్డీఎఫ్సీ తెర మరుగు కానుంది. రేపటి నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ విలీనం అమల్లోకి రానుంది.దీంతో ఆయన ఇవాళ హెచ్డీఎఫ్సీ నుంచి వైదొలగుతున్నట్లు వాటాదారులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. 33 ఏళ్ళ క్రితం హెచ్డీఎఫ్సీ ప్రారంభమైనపుడు పగ్గాలు చేపట్టిన దీపక్ పరేఖ్… తన కెరీర్లో ఆ సంస్థను దేశంలో అతి పెద్ద ప్రైవేట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా తీర్చిదిద్దారు. ఐసీఐసీఐని 1977లో ఆయన బంధువు హెచ్‌టీ పరేఖ్ ప్రారంభించారు. 1978లో హెచ్‌డీఎఫ్‌సీలో చేరిన దీపక్ పరేఖ్ పలు ఇతర ఆర్థిక సంస్థల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రభుత్వం నియమించిన అనేక కమిటీల్లో పరేఖ్ ఉన్నారు. దేశీయంగా హౌసింగ్ ఫైనాన్స్ బలపడటానికి ఆయన ఎంతో కృషి చేశారు. పద్మభూషన్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది.