డెలివరీ ఏజెంట్‌గా జొమాటొ యజమాని
కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుతూ డిసెంబర్ 31న దేశ వ్యాప్తంగా జరిగిన పార్టీలతో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లకు జోష్‌ను పెంచాయి. ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఆర్డర్ల రద్దీని తట్టుకోవడం ఈ కంపెనీల స్టాఫ్‌కు ఓ ఛాలెంజ్‌గా మారింది. దీంతో జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ కూడా అర్ధరాత్రి డెలివరీ ఏజెంట్‌గా మారారు. డెలివరీ ఏజెంట్‌గా ఆర్డర్లు ఇవ్వడానికి సబంధించిన ఫోటోను గోయల్ ట్విటర్లో షేర్ చేశారు. జొమాటో ప్రధాన కార్యాలయంలో ఆర్డర్‌ను డెలివరీ చేస్తున్న ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. తన తొలి డెలివరీ తనను తిరిగి జొమాటో ఆఫీస్‌కు రప్పించిందని పోస్ట్‌లో రాశారు.