ఐఆర్డీఏఐ చైర్మన్‌గా దేబశిశ్ పాండా!
బీమారంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్‌గా కేంద్ర ఆర్థిక సేవల శాఖ మాజీ కార్యదర్శి దేబశిశ్ పాండాను నియమించారు. ఈ పదవిలో దేబశిశ్ పాండా మూడేళ్ళు ఉంటారు. ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇతను. కేంద్ర ఆర్థిక సేవల శాఖ కార్యదర్శిగా పని చేసి గత జనవరిలో పదవీ విరమణ చేశారు. గతేడాది మేలో సుభాష్ చంద్ర ఖుంతియా రిటైర్ అయ్యాక 10 నెలల తరవాత తాజాగా కేంద్రం ఐఆర్డీఏఐ చైర్మన్‌గా నియమించింది. దేశంలోని ఇన్సూరెన్స్ సంస్థలకు లైసెన్సులను జారీ చేయడంలో, వాటి లావాదేవీలను నియంత్రించడంలో ఐఆర్డీఏఐ కీలకంగా వ్యవహరిస్తుంది.