డాబర్ చేతికి బాద్షా
డాబర్ ఇం డియా కంపెనీ ప్రముఖ మసాలా దినుసుల కంపెనీ బాద్ షా మసాలాలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. 51 శాతం వాటాను రూ.587.52 కోట్లతో కొనుగోలు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. బాద్షా కంపెనీ మొత్తం విలువను రూ.1,152 కోట్లుగా లెక్కగట్టారు. మరోవైపు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 2.85 శాతం తగ్గి రూ.490.86 కోట్లకు చేరింది. గతఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.505.31 కోట్లు. ఇక టర్నోవర్ స్వల్పంగా పెరిగి రూ.2,986.49 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది.