క్రిప్టో… కొనసాగుతున్న నష్టాలు
ఉక్రెయిన్ యుద్ధ భయాలకు క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. గత వారం రోజుల నుంచి స్టాక్ మార్కెట్‌తోపాటు క్రిప్టో మార్కెట్లో ఒత్తిడి కొనసాగుతోంది. బిట్‌కాయిన్ 45000 డాలర్ల నుంచి 40,000 డాలర్లకు దిగువకు చేరింది. తాజా సమాచారం ప్రకారం బిట్ కాయిన్ 2.22 శాతం నష్టంతో 39,111 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎథీరియంలో నష్టాలు స్వల్పంగా ఉంది. ఈ కరెన్సీ కూడా 2750 డాలర్లకు దిగువకు వచ్చేసింది. ప్రస్తుతం 2713 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బీఎన్బీ ఒకటిన్నర శాతం నష్టంతో ఉంది. ఇక మన కరెన్సీలో బిట్ కాయిన్ నష్టాలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం 3 శాతం నష్టంతో బిట్‌కాయిన్ రూ. 31,00,000 వద్ద ట్రేడవుతోంది. ఈథెర్, బీఏటీ, పాలిగాన్, లైట్ కాయిన్ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.